తిరుమల శ్రీవారిని హీరో నాని దర్శించుకున్నారు. నాని తాజా చిత్రం గ్యాంగ్ లీడర్ ఈ నెల 13 న విడుదల కానున్నండటంతో ఆ చిత్ర బృందం కూడా తిరుమలను సందర్శించారు. చిత్ర దర్శకుడు విక్రమ్ కె. కుమార్ తో కలిసి పనిచేయటం తనకు కొత్త అనుభూమతిని ఇచ్చిందని నాని అన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిత్రం ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వవిప్, తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆహ్వానం మేరకు తుమ్మలగుంటలోనిఆయన నివాసానికి వెళ్లారు. చెవిరెడ్డి నివాసంలో అల్పహారం తీసుకున్న అనంతరం రెండు లక్షల మట్టిగాజులతో ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జనం కార్యక్రమంలో నాని పాల్గొన్నారు.
ఇదీ చూడండి:'గ్యాంగ్‌లీడర్ టైటిల్ ఆలోచన అతడిదే'