తెదేపా సీనియర్ నేతలు మాజీ ఎమ్మెల్యే ఎన్‌పీ వెంకటేశ్వరచౌదరి, మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణతో భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి భేటీ అయ్యారు. చిత్తూరులోని మాజీ ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్న ఆయన వారితో గంటకు పైగా చర్చలు జరిపారు. భాజపాలో చేరాలంటూ వారిరువురినీ ఆహ్వానించారు. ఈ సందర్భంగా భాజపా అగ్రనేతలతో మాజీ ప్రజాప్రతినిధులు చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం.
పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర ఇన్‌ఛార్జి సునీల్ థియోదర్, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సమక్షంలో వీరు భాజపాలో చేరనున్నట్లు తెలిసింది. భాజపాలో చేరిక విషయమై మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరచౌదరిని ‘న్యూస్‌టుడే’ అడగ్గా.. తమను భాజపాలోకి ఆహ్వానించిన విషయం వాస్తవమని తెలిపారు. జాతీయ అగ్రనేతల సమక్షంలో పార్టీలోకి చేరతామని ఆయన పేర్కొన్నారు.