స్థానిక సంస్థల ఎన్నికల్లో....సక్రమంగా విధులు నిర్వహించని అధికారులను ప్రశ్నించినందుకే తనపై తప్పుడు కేసులు బనాయించారని మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత అమర్‌నాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా వి.కోట పోలీస్ స్టేషన్లో పార్టీ కార్యకర్తలతో కలిసి హాజరైన ఆయన....తనకు జారీ చేసిన నోటీసులపై సమాధానమిచ్చారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై మాజీ మంత్రిని పోలీసులు విడిచిపెట్టారు.
తన తండ్రి హయాం నుంచి రాజకీయాల్లో ఉన్నా...ఏ రోజూ ఓ కేసులో ఏ1 నిందితుడిగా ఉండేంత తప్పులు చేయలేదన్నారు అమర్‌నాథ్ రెడ్డి. స్థానిక ఎన్నికల్లో వైకాపా ఆగడాలను అడ్డుకున్నందుకు, ఎన్నికల అధికారులను ప్రశ్నించినందుకే తనతో సహా 38మంది తెదేపా కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించారని ఆయన ఆరోపించారు. సంవత్సర కాలంలో వైకాపా ప్రభుత్వం సాధించిన ప్రగతి శూన్యమని అమర్ నాథ్ రెడ్డి విమర్శించారు.
ఇవీ చదవండి: ఆలయాలు తెరిచేందుకు సన్నద్ధంకండి: వెల్లంపల్లి