చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని రియల్ ఎస్టేట్ వ్యాపారులు తుడా నిబంధనలను ఉల్లంగిస్తున్నారు. సాగు భూములకు ఎగువన లేఅవుట్లు ఏర్పాటు చేయటం వలన పంట నష్టపోతున్నామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని ఇందిరమ్మకాలనీకి ఉత్తరంగా డాలర్స్ కాలనీ, కిలరీస్ చంద్రగిరి గార్డెన్ల రియల్ ఎస్టేట్ యజమానుల నిర్వాకంతో పొలంలో నీరు చేరి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతీయ రహదారి పక్కనున్న వాగు ప్రభుత్వ స్థలాన్ని కొంతమంది రైతులు ఆక్రమించుకోవడంతో దిగువనున్న పొలాల్లో వర్షపు నీరు చేరుతోంది.
పంట నీట మునగటంతో ఓ రైతు రహదారిని తవ్వి కాలువ ఏర్పాటు చేశాడు. నీరంతా దిగువకు చేరటంతో మరో రైతు పొలం చెరువును తలపించింది. దీంతో వారివురి మధ్య వివాదం జరిగింది. రియల్ ఎస్టేట్ యజమానులు తుడా నిబందనలు పాటించక పోవడం వల్లే ఈ సమస్య ఏర్పడిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి... చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి: 'వృద్ధాశ్రమాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి'