ETV Bharat / state

'చేతులు జోడించి కోరుతున్నా.. తిరుమల శ్రీవారి జోలికి వెళ్లొద్దు' - మాజీ తుడా ఛైర్మన్ నరసింహయాదవ్

"చేతులు జోడించి కోరుతున్నాను.. తితిదే ఆస్తులు, శ్రీవారి జోలికి వెళ్లొద్దు" అని చిత్తూరు జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి నరసింహయాదవ్ అన్నారు. సొంత మనుషులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం తితిదే ద్వారా దేవాలయ ఆస్తులు అమ్మాలనుకుంటోందని ఆరోపించారు.

ex tuda chairman narasimha yadav about tirumala assests selling
తుడా మాజీ ఛైర్మన్ నరసింహయాదవ్
author img

By

Published : May 24, 2020, 3:12 PM IST

నిరర్ధక ఆస్తుల పేరిట తితిదే భూములను వేలం వేయటం.. శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయటమేనని చిత్తూరు జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి, తుడా మాజీ ఛైర్మన్ నరసింహయాదవ్ అన్నారు. తిరుపతిలో మాట్లాడుతూ.. తితిదే ఆస్తులు... తిరుమల శ్రీవారి జోలికి రావద్దని కోరారు.

కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రజలంతా ఇళ్లలో ఉన్న వేళ... ప్రభుత్వం తితిదే ఆస్తులను విక్రయించాలనుకోవడం దారుణమన్నారు. సంక్షేమ పథకాల కోసం దేవాలయాల భూములను విక్రయించే హక్కు ప్రభుత్వానికి లేదన్న ఆయన... సొంత మనుషులకు లబ్ధి చేకూర్చేందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.

ఇవీ చదవండి:

తితిదే ఆస్తుల వేలాన్ని ఆపాలి:రామకృష్ణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.