చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ ఎన్నికల ముందస్తు ప్రచారం నిర్వహించారు. త్వరలో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో సత్యవేడులో పర్యటించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తనను పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించాలంటూ ఓటర్లను ఆభ్యర్థించారు. ప్రజల సమస్యలను తీర్చడంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు విఫలమయ్యాయని చింతామోహన్ దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల