పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రోజే.. వైకాపా ప్రభుత్వం వాస్తవ ప్రపంచంలోకి వచ్చి ఉంటే బాగుండేదని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి విమర్శించారు. చిత్తూరు జిల్లా తెదేపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
యాదమరి మండలం నామినేషన్ ప్రక్రియలో.. తెదేపా బలపరిచిన అభ్యర్థులపై దాడులకు పాల్పడిన ఘటనను మాజీ మంత్రి ఖండించారు. నామినేషన్ వేస్తున్న వారిపై ఏదో రకంగా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చేస్తున్న పనులపై వైకాపా ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. నేతలంతా కలిసి బృందంగా యాదమరికి వెళ్లి.. అక్కడ జరిగిన పరిస్థితులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు.
ఇదీ చదవండి: