Duranto Express catches fire: దురంతో ఎక్స్‌ప్రెస్‌లో స్వల్పంగా మంటలు రావడం కలకలం సృష్టించింది. చిత్తూరు జిల్లా కుప్పం రైల్వేస్టేషన్లో చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి హవ్డా వెళ్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్-9 బోగీలో ఒక్కసారిగా స్వల్ప మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది రైలును కుప్పం రైల్వేస్టేషన్లో ఆపారు. విషయం తెలుసుకుని ప్రయాణికులు రైలు దిగి.. పరుగులు తీశారు. సిబ్బంది వెంటనే స్పందించి.. చర్యలు చేపట్టి మంటలార్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. మంటలార్పిన అనంతరం ట్రైన్ బయలుదేరింది. ఈ ఘటనలో ఎలాంటి అపాయం జరగకపోవడంతో ప్రయాణికులు, రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇవీ చదవండి: