చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఈనెల 6న జరిగిన హత్యకు సంబంధించి ఆరుగురిని అరెస్టు చేసినట్లు పుత్తూరు డీఎస్పీ మురళీధర్ సోమవారం వెల్లడించారు. ఎస్సీ వాడకు చెందిన కృష్ణయ్యను ఆరుగురు దాడి చేసి చంపినట్లు కృష్ణయ్య కుమార్తె వనజ ఫిర్యాదు ఇచ్చారు. ఈ మేరకు దర్యాప్తు చేసి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరిని పుత్తూరు కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన సిబ్బందిని అభినందించారు.
ఇదీ చదవండి: