ETV Bharat / state

DOLLAR SESHADRI FUNERALS: నేడు డాలర్ శేషాద్రి అంత్యక్రియలు

author img

By

Published : Nov 30, 2021, 7:22 AM IST

Updated : Nov 30, 2021, 9:33 AM IST

TOADAY DOLLAR SESHADRI FUNERALS: డాలర్ శేషాద్రి పార్థివదేహాన్ని విశాఖ నుంచి తిరుపతిలోని ఆయన స్వగృహానికి తరలించారు. ఈరోజు మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

dollar-seshadri-funerals-on-today-afternoon-at-tirupathi
ఈరోజు మధ్యాహ్నమే డాలర్ శేషాద్రి అంత్యక్రియలు

DOLLAR SESHADRI DEAD BODY IN TIRUPATHI: తిరుమల శ్రీవారి ఆలయంలో సుదీర్ఘకాలం సేవలందించిన డాలరు శేషాద్రి పార్థివదేహానికి తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి నివాళులు అర్పించారు. విశాఖలో నిన్న ఉదయం శేషాద్రి గుండెపోటుతో మృతి చెందారు. ఆయన పార్థివదేహాన్ని తిరుపతిలోని ఆయన స్వగృహానికి తరలించారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. డాలర్‌ శేషాద్రి పార్థివదేహానికి నివాళులర్పించనున్నారు. అనంతరం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

అసలెలా జరిగింది?

DOLLAR SESHADRI PASSES AWAY: సాగర తీరంలో సోమవారం రాత్రి నిర్వహించతలపెట్టిన కార్తిక దీపోత్సవంలో పాల్గొనేందుకు ఆదివారం ఆయన విశాఖ వచ్చారు. అదేరోజు సాయంత్రం సింహాచలంలోని సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. రాత్రి 8 గంటలకు ఉత్సవమూర్తుల కల్యాణ రథంలో విశాఖలోని తితిదే కల్యాణ మండపానికి చేరుకున్నారు. ఉత్సవమూర్తులను దించి, స్వామి పవళింపు సేవలో పాల్గొన్నారు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత కల్యాణ మండపంలోనే నిద్రకు ఉపక్రమించారు. సోమవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఛాతీనొప్పి రావడంతో వ్యక్తిగత సహాయకులు రాంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడికి చేరుకునేలోపే శేషాద్రి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

EMBAMBING TO DOLLAR SESHADRI DEAD BODY: కేజీహెచ్‌లో శేషాద్రి భౌతికకాయానికి ఎంబామింగ్‌ చేసి రోడ్డుమార్గంలో తిరుపతికి తరలించారు. ఆయన పార్థివ దేహాన్ని మంగళవారం మధ్యాహ్నం వరకు సందర్శనార్థం తిరుపతిలోని సరోజినీదేవి లేఔట్‌లో ఉంచనున్నారు. అనంతరం గోవిందధామంలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. అంత్యక్రియలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ, పలువురు మఠాధిపతులు, పీఠాధిపతులు హాజరుకానున్నట్లు తితిదేకు సమాచారం అందింది.

VIPS CONDOLENCE ON DOLLAR SEHSADRI: డాలర్ శేషాద్రి మృతి గురించి తెలుసుకున్న ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఉపరాష్ట్రతి వెంకయ్య నాయుడు, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్‌, ముఖ్యమంత్రి జగన్, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, తెదేపా అధినేత చంద్రబాబు, నారా లోకేశ్​, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి, తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర, మాజీ తితిదే బోర్డు సభ్యులు ఏవీ రమణలు డాలర్ శేషాద్రితో తమకున్న బంధాన్ని గురించి గుర్తు చేసుకున్నారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సంబంధిత కథనాలు:

Last Updated : Nov 30, 2021, 9:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.