తిరుపతిలోని బాలాజీ కాలనీలో ఓ చిన్న కుక్కపిల్ల అటుగా వెళ్లే వాహన చక్రం కిందపడి చనిపోయింది. ఆ కుక్కపిల్ల అరుపు విని తన తల్లి ఎక్కడి నుంచో పరిగెత్తుకు వచ్చింది. బిగ్గరగా అరుస్తూ.. అటుగా వెళ్తున్న వారిపై దాడికి దిగింది. కొద్ది సేపటికి రక్తం మడుగులో ఉన్న తన పిల్ల చుట్టూ తిరుగుతూ అటు ఇటు కదుపుతూ.. కుక్కపిల్లకు అంటిన రక్తాన్ని శుభ్రం చేసింది. పైకి లేపేందుకు ప్రయత్నించింది. కానీ అప్పటికే ఆ చిన్ని కుక్క పిల్ల చనిపోయింది.
మరో పక్క ఇంకో బిడ్డ పాలకోసం తల్లిదగ్గరకు వచ్చి పాలు తాగుతోంది. ఓ వైపు ఒక బిడ్డకు పాలు ఇస్తూనే..చనిపోయిన మరో బిడ్డను బాధగా చూస్తూ ఉండిపోయింది. ఈ దృశ్యాలు చూసిన స్థానికులు కుక్క తల్లి పడుతున్న తపనను చూసి కంటనీరు పెట్టుకున్నారు.
ఇదీ చదవండి: రిక్షావాలా కథ: 8 రోజులు- 11 రిక్షాలు- 1100 కి.మీ.