చిత్తూరు జిల్లా మండలంలోని అగర మంగళం ఆంజనేయస్వామి ఆలయంలో నంది విగ్రహాన్ని ధ్వంసం చేసిన కేసులో అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ జీడీ నెల్లూరు పోలీస్ స్టేషన్ లో విచారించారు. జీడీ నెల్లూరు, పాల సముద్రం మండలాలకు చెందిన సుమారు 50 మంది తెదేపా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనలో కుట్ర దాగి ఉందన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. నంది విగ్రహం ధ్వంసం అయిన ఘటనలో తమను అదుపులోకి తీసుకోవడంపై తెదేపా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలకు తమకు ఎలాంటి సంబంధం లేకపోయినా.. తమను అదుపులోకి తీసుకోవడం తగదని పలువురు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా నేతల కనుసన్నల్లో పోలీసులు ఇలాంటి పని చేస్తున్నారని ఆరోపించారు.
ఇవీ చూడండి...