ETV Bharat / state

తిరుపతిలో జిల్లాస్థాయి టాస్క్​ఫోర్స్ సమావేశం - minister peddireddy ramachandhra reddy

దిల్లీతో పాటు బెంగళూరు, చెన్నైల్లో జరిగిన మత ప్రార్థనా సమావేశాల్లో పాల్గొన్న వారి వివరాలు సేకరిస్తున్నామని చిత్తూరు జిల్లా పాలనాధికారి భరత్ గుప్తా తెలిపారు. జిల్లాలో కరోనా పాజిటివ్ నమోదైన వ్యక్తుల వివరాలు సేకరించి, వారి కదలికలను అనుక్షణం పర్యవేక్షిస్తున్నామని ఆయన తెలిపారు.

District Level Task Force Meeting in Tirupati
తిరుపతిలో జిల్లాస్థాయి టాస్క్​ఫోర్స్ సమావేశం
author img

By

Published : Apr 1, 2020, 4:30 PM IST

తిరుపతిలో జిల్లాస్థాయి టాస్క్​ఫోర్స్ సమావేశం

దిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ సమావేశంతో పాటు బెంగళూరు, చెన్నైల్లో జరిగిన సమావేశాల్లో పాల్గొన్న వారి ఆచూకీపై ఆరా తీస్తున్నట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా తెలిపారు. తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలతో జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ సమావేశం నిర్వహించిన ఆయన....కరోనా లక్షణాలున్న అనుమానితులను అత్యవసర వైద్యసహాయం కోసం తరలిస్తున్నామన్నారు. మత ప్రార్థన సమావేశాల్లో పాల్గొన్నవారి కుటుంబ సభ్యులను క్వారంటైన్​కు తరలిస్తున్నామని తెలిపారు. జిల్లావ్యాప్తంగా నమోదైన పాజిటివ్ వ్యక్తుల కదలికలపై నివేదికలు తయారు చేశామన్నారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితమై కరోనాను ఎదుర్కొనేందుకు సహకరించాలని కోరారు.

ఇదీ చదవండి.

కరోనా నివారణకు శ్రీకాళహస్తిలో శనీశ్వరునికి పూజలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.