చిత్తూరు జిల్లాలోని వరసిద్ధి వినాయకుడి కాణిపాకం ఆలయానికి సుబ్బారావు అనే భక్తుడు విరాళం అందించాడు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సుబ్బారావు ఆలయాభివృద్ధికి రూ.31.50లక్షలు ఇచ్చాడు. గోసంరక్షణ ట్రస్ట్, భక్తుల వసతి సముదాయ ట్రస్ట్‌కు తొమ్మిది లక్షల చొప్పున, నిత్యాన్నదానం ట్రస్ట్‌కు ఏడు లక్షలు, బంగారు రథం నిర్మాణానికి ఆరున్నర లక్షల రూపాయలు విరాళం అందించారు. ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో ఆలయ ఈవో వెంకటేశ్‌కి ఇచ్చారు. ఆలయ అభివృద్ధికి విరాళమిచ్చిన సుబ్బారావు కుటుంబసభ్యులకు ఆలయ పండితులు వేదాశీర్వచనం ఇచ్చి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఇదీ చదవండి: శ్రీవారి ఆలయంలో బాధ్యతలు చేపట్టిన 8 మంది కొత్త అర్చకులు