ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఏమన్నారంటే..
'కరోనా పాజిటివ్ అని తేలి.. ఆస్పత్రిలో చేరినవారు వైద్యులకు సహకరించకుండా చిలిపి చేష్టలు చేస్తున్నారు. దిల్లీకి వెళ్లి వచ్చినవారు ఎంగిలి ప్లేట్లు, స్పూన్లు నాకుతూ వైరస్ను వ్యాప్తి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటువంటి వాటికి స్వస్తి పలికి వైద్యులకు సహకరించాలి'
తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో.. వాటిని ఉపసంహరించుకుంటున్నట్లు ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ఇదీ చదవండి: ఆ మృతదేహానికి జరగని అంత్యక్రియలు..ఎందుకంటే..!