చిత్తూరు జిల్లా పూతలపట్టు జి.డి నెల్లూరు నియోజకవర్గాలలో 80 వేల ఎకరాల ఆయుకట్టకు సాగు నీరు అందించేందుకు అవసరమైన జలాశయ నిర్మాణానికి ప్రతిపాదనలను పంపాలని జిల్లా నీటిపారుదల అధికారులను డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పూతలపట్టు మండలం చామంతిపురం వద్ద 5 టీఎంసీలతో రిజర్వాయర్ నిర్మాణం కోసం రూ.3వేల కోట్లతో ప్రతిపాదనలను సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు.
ఈ నిర్మాణంతో 80వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు వీలవుతుందన్నారు. జి.డి. నెల్లూరు నియోజకవర్గంలో రిజర్వు అటవీభూమి అనుభవించే వారికి హక్కు కల్పించే అంశాన్ని పరిశీలించాలని డీఎఫ్ఓ నరేంద్రకు సూచించారు. జిల్లాలో చెరువుల ఆక్రమణల తొలగింపునకు వెంటనే చర్యలు చేపట్టాలని, అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కు సూచించారు. జిల్లాలో నాటు సారా నిర్మూలనకు పటిష్టంగా చర్యలు చేపట్టాలని ఎస్ఈబీ రిశాంత్ రెడ్డికి తెలిపారు.
ఇదీ చదవండి: