ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న నిర్ణయాల్లో రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. చిత్తూరు జిల్లా కలికిరి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తితిదేకి అప్పగించే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎంతో ప్రాశస్త్యం ఉన్న ఆలయ నిర్వహణ భారాన్ని తితిదే తీసుకోవటంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీచదవండి