ఇవీ చదవండి:
'కుప్పం ప్రజా చైతన్య యాత్రలో చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదం' - చంద్రబాబుపై ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి వ్యాఖ్యలు
ప్రజాచైతన్య యాత్ర పేరుతో కుప్పంలో పర్యటించిన ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి విమర్శించారు. ప్రభుత్వం మద్యం నిషేధ కార్యక్రమాలు అమలు చేస్తోంటే తెదేపా అధినేత మాత్రం మద్యం దొరకటం లేదంటూ ప్రకటిస్తున్నారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 43వేల బెల్టు షాపులు తొలగించామని తెలిపారు. మరికొద్ది రోజుల్లోనే చంద్రబాబు అవినీతి మెుత్తం వెలుగులోకి వస్తుందన్నారు.
చంద్రబాబుపై ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి వ్యాఖ్యలు
TAGGED:
deputy cm comments on cbn