ETV Bharat / state

పద్మావతి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పణ - tirupati latest news

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఈ నెల 19వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ క్రమంలో అమ్మవారికి ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి పట్టు వస్త్రాలు సమర్పించారు.

tiruchanoor
tiruchanoor
author img

By

Published : Nov 11, 2020, 6:51 PM IST

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఈ నెల 19వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి బుధవారం కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలు అందించారు.

తితిదే ఈవో జవహర్ రెడ్డి, తిరుపతి జేఈవో బసంత్ కుమార్, సీవీఎస్​వో గోపీనాథ్ జెట్టి, ఇతర అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. కార్యక్రమం అనంతరం ఉప ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రజలకు సేవ చేయాలని తపించే ముఖ్యమంత్రి జగన్ కలలు నెరవేర్చాలని అమ్మవారిని కోరుకున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి

వైభవంగా ప్రారంభమైన పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.