తిరుమల శ్రీవారిని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, శాసనసభ ప్రివిలేజ్ కమిటీ అధ్యక్షుడు కాకాణి గోవర్థన్ రెడ్డి, కమిటీ సభ్యులు, తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్న ప్రముఖులకు తితిదే అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.
తమ పార్టీ ఏ మతానికి, ఏ కులానికి వ్యతిరేకం కాదనీ.. అన్ని మతాలను గౌరవిస్తామని.. ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ఈ సందర్భంగా కాకాణి గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ.. శాసనసభ్యులందరీ హక్కులను కాపాడేందుకు కృషి చేస్తామన్నారు.
తిరుమలలో ఫిబ్రవరి 19న జరగనున్న రథసప్తమికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనల దృష్ట్యా.. ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో 14 వందల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రజల సమన్వయంతో విలేజ్ డిఫెన్స్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
ఇదీ చదవండి: ఎస్వీ మ్యూజియం అభివృద్ధిపై తితిదే ఈవో సమీక్ష