కర్నూలు జిల్లాలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మృతుల స్వస్థలమైన చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలం తరిగొండలో 7 మృతదేహాల ఖననానికి ఏర్పాట్లు చేశారు. బి.కొత్తకోట మండలం సర్కారుతోపులో 4 మృతదేహాలను.. మదనపల్లెలో 3 మృతదేహాలను ఖననం చేయనున్నారు. పెను విషాద ఘటనను బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమతో కలివిడిగా తిరిగిన కుటుంబం తుడిచిపెట్టుకుపోవడంపై కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రమాదంలో ప్రాణాలతో మిగిలిన నలుగురు చిన్నారులకు.. కర్నూలు సర్వజన వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు.
మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణస్వామి ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పగా.. నేడు వారే నేరుగా వచ్చి మృతుల కుటుంబాలను పరామర్శించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: నెల్లూరు జిల్లాలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి..