విపత్తు సమయంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై పెనుభారాన్ని మోపుతోందంటూ తిరుపతిలో వామపక్షాల నేతలు ఆందోళన చేపట్టారు. నగరంలోని ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ప్రజలకు సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసారు.
కరోనా మహమ్మారితో ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న తరుణంలో ప్రభుత్వం అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోవటం సమంజసం కాదన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇదీ చదవండి: