చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం కోళ్ల బైలు పంచాయతీలో నెలకొన్న వివాదం ఎట్టకేలకు ముగిసింది. కోళ్ల బైలులో నెట్ వర్క్ సమస్యలతో.. కౌంటింగ్‌ను పక్క గ్రామం బయ్యారెడ్డి పల్లెలో నిర్వహించాలని ఎన్నికల అధికారులు తీసుకున్న నిర్ణయం తీవ్ర ఉత్కంఠకు దారి తీసింది. గ్రామం నుంచి బ్యాలెట్ బాక్సులను బయటకి వెళ్లనిచ్చేది లేదంటూ గ్రామస్తులు ఆందోళను దిగారు. బ్యాలెట్ పెట్టెలు పక్కన గ్రామానికి వెళ్తే కౌంటింగ్ తేడా జరుగుతుందని అనుమానం వ్యక్తం చేసిన గ్రామస్తులు.. పేపర్ కౌంటింగ్‌కి నెట్ వర్క్‌తో పనేంటంటూ ప్రశ్నించారు.
ఎంతకీ ఆందోళన విరమించక పోవటంతో..
ఆందోళన ఎంతకీ విరమించక పోవటంతో మదనపల్లె సబ్ కలెక్టర్ జాహ్నవి, ఏఎస్పీ రిషాంత్ రెడ్డి కోళ్ల బైలుకు చేరుకొని సర్పంచ్ అభ్యర్థులతో మాట్లాడారు. స్వయంగా తామే దగ్గర ఉండి కౌంటింగ్ జరిపిస్తామని సబ్ కలెక్టర్ హామీ ఇవ్వటంతో గ్రామస్థులు ఆందోళన విరమించారు. పటిష్ట పోలీస్ భద్రత మధ్య బ్యాలెట్ బాక్సులను బయ్యారెడ్డి కాలనీకి తరలించారు. దాదాపు 5 గంటలు ఆలస్యంగా కోళ్ల బైలు పంచాయతీ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.
ఇవీ చూడండి...: కౌంటింగ్ కేంద్రంలో ఉద్రిక్తత.. రీకౌంటింగ్ చేయాలంటూ ఆందోళన