చిత్తూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. సగటున రోజుకు 200కు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 218 కేసులు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా తిరుపతి, నగరి, పుత్తూరు, చిత్తూరు, శ్రీకాళహస్తి, మదనపల్లె, తిరుపతి గ్రామీణ ప్రాంతాల వారు ఉన్నారు.
తిరుపతి గ్రామీణ పరిధిలోని తిరుచానూరు, ఆవిలాల, శెట్టిపల్లె, పద్మావతిపురం గ్రామ పంచాయతీల్లో లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు నిత్యావసరాల కొనుగోలుకు మినహాయింపు ఇచ్చారు. తాజా కేసుల్లో తిరుపతి నగరంలో 119, పాకాల 13, మదనపల్లె -9, తిరుపతి గ్రామీణ-9, నగరి-7, చిత్తూరు- 5 లో నమోదయ్యాయి.
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 20 కేసులకు పైగా నమోదైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు.. వైరస్ వ్యాప్తి నివారణకు చర్యలు చేపడుతున్నారు. పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో గ్రామ సచివాలయ సిబ్బంది తరచూ పర్యటిస్తూ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, 60 ఏళ్లు వయసు పైబడిన వారి ఆరోగ్య పరిస్థితులను సమీక్షిస్తున్నారు. చిత్తూరు, తిరుపతి నగరాలతో పాటు శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరి పట్టణాల్లో పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్న కారణంగా.. ఆంక్షలు కఠినతరం చేస్తున్నారు.
ఇదీ చదవండి:
కరోనా విధుల్లో ఉంటూ.. ప్రాణాలు కోల్పోయిన సిబ్బందికి పవన్ శ్రద్ధాంజలి