చిత్తూరు జిల్లాలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతూనే ఉంది. జిల్లాలో తాజాగా 5 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని సత్యవేడు 2, నాగలాపురం, శ్రీకాళహస్తి , దామినేడు లో ఒక్కోకేసు నమోదైంది. దీంతో జిల్లా వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 197కి చేరింది. చిత్తూరు జిల్లాలో తొలి కరోనా మరణం చోటు చేసుకుంది. గుంటూరు నుంచి శ్రీకాళహస్తికి వచ్చిన వ్యక్తి ద్వారా అతని తండ్రికి కరోనా సోకగా.. చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. మంగళవారం నమోదైన 5 కేసుల్లో..అన్ని కేసులు చెన్నై కోయంబేడు మార్కెట్‌తో సంబంధం ఉన్నవిగా అధికారులు ప్రకటించారు. కోవిడ్ ఆస్పత్రి నుంచి జిల్లాలో 13మంది డిశ్చార్జ్ కాగా.. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 95గా ఉంది. ప్రస్తుతం జిల్లాలో 101 యాక్టివ్ కేసులున్నాయి.
ఇదీ చదవండి: ఏపీ ఈఎన్సీకి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖ