ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో కలవరపెడుతున్న కరోనా కేసులు

author img

By

Published : Mar 21, 2021, 10:23 AM IST

రాష్ట్రంలో మరే జిల్లాలో లేని రీతిలో కరోనా కేసుల సంఖ్య చిత్తూరు జిల్లాలో పెరుగుతుండటం అధికారులను కలవరపెడుతోంది. తొలి దశలో అధిక పాజిటివ్‌ కేసులతో పాటు మరణాలతో రాష్ట్రంలో చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. జిల్లాలో నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసులలో ఎక్కువ తిరుపతి నగరంలోనే ఉండటంతో.. కేసుల సంఖ్య పెరగడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. దేశం నలుమూలల నుంచి శ్రీవారిని దర్శించుకొనే వారి సంఖ్య పెరగడంతోనే తిరుపతిలో ఈ పరిస్థితికి కారణమన్న అభిప్రాయం నెలకొంది

chittore district corona cases
చిత్తూరు జిల్లాలో కలవరపెడుతున్న కరోనా కేసులు

కరోనా మహమ్మారి మరోసారి చిత్తూరు జిల్లా వాసులను భయపెడుతోంది. రాష్ట్రంలో మరే జిల్లాలో నమోదుకాని రీతిలో చిత్తూరు జిల్లాలో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. గత ఏడాది కాలంలో 88,349 కేసులు నమోదవగా 857 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. అత్యధిక మరణాలతో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిన చిత్తూరు జిల్లా ... తాజాగా నమోదవుతున్న కేసులు కూడా అదే స్థాయిలో ఉండటంతో అధికారుల్లో అందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 2083 యాక్టివ్‌ కేసులలో 490 కేసులు జిల్లాలో ఉండటం స్థానిక పరిస్థితులకు అద్దం పడుతోంది.

పద్మావతి కోవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స

కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అప్రమత్తమైన అధికారులు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం చేయడంతో పాటు.. అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేశారు. కరోనా పాజిటీవ్‌ ఉన్న వారిని హోం ఐసొలేషన్‌లో ఉంచి.. వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పద్మావతి కోవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స అందివ్వడానికి చర్యలు చేపట్టారు.

కారణాల అన్వేషణ..

కేసుల సంఖ్య పెరగడానికి గల కారణాలపై అధికారులు సమీక్షిస్తున్నారు. కరోనా కేసులు తీవ్రంగా ఉన్న మహారాష్ట్రతో పాటు ఉత్తరాది రాష్ట్రాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందుతోందా అన్న కోణంలో అధికారులు పరిశీలన చేస్తున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా 25 వేల తిరుమల శ్రీవారి దర్శన టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా ప్రతినెలా విడుదల చేస్తున్నారు. వీటిని దేశంలోని వివిధ ప్రాంతాల భక్తులు కొనుగోలు చేసే అవకాశం ఉండటంతో ఉత్తరాధి భక్తులు దర్శనానికి ఎక్కువగా వస్తున్నారు.

ఇదీ చూడండి. వాహనం అదుపుతప్పి ఒకరు.. దైవ దర్శనానికి వెళ్లి వస్తూ మరొకరు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.