తిరుపతిలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి... ఆయా ప్రాంతాల్లో రాకపోకలు జరగకుండా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా ఎయిర్ బైపాస్ రోడ్ పరిధిలో కొవిడ్ కేసులు నమోదు అయ్యాయి.
ఆ ప్రాంతంలో ప్రధాన రహదారి అయిన అన్నమయ్య కూడలి నుంచి లక్ష్మీపురం కూడలి వరకు రాకపోకలు నియంత్రిస్తూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో ఎటువంటి కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. బయటికి వస్తున్న వారికి కరోనాపై అవగాహన కల్పిస్తూ తిప్పి పంపిస్తున్నారు.
ఇదీ చదవండి: