తిరుపతి అలిపిరిలో తితిదే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చేశారు. తమను రాష్ట్ర ఔట్ సోర్సింగ్ కార్పోరేషన్లో కలపాలన్న తితిదే పాలకమండలి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. భౌతికదూరం పాటిస్తూ రోడ్డుపై బైఠాయించారు.
పాలకమండలి సమావేశంలో తమను తితిదే ఉద్యోగులుగానే పరిగణిస్తూ టైం స్కేల్ ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాలంటూ తితిదే ఛైర్మన్ వై.వి సుబ్బారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఛైర్మన్ సానుకూలంగా స్పందించిన కారణంగా నిరసన విరమించారు.
ఇదీ చదవండి: