ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో అలసత్వాన్ని ఏ మాత్రం సహించబోమని జిల్లా పాలనాధికారి భరత్ గుప్తా స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు.
పాల సముద్రం, వెంగళరాజు కుప్పం, శ్రీ కావేరి రాజపురం, కృష్ణ జమ్మాపురం పంచాయతీలో జరుగుతున్న నాడు నేడు అభివృద్ధి పనులను కలెక్టర్ తనిఖీ చేశారు. కొన్ని అభివృద్ధి పనులు ఆలస్యంగా నడుస్తున్నాయని గుర్తించిన ఆయన... అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. మీ సొంత పనులు అయితే ఇంత ఆలస్యం చేస్తారా? అంటూ కోపాద్రిక్తుడయ్యారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సచివాలయ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: సంక్షేమ ఒరవడిలో... భారమైన సాగుబడి