ETV Bharat / state

శ్రీకాళహస్తిలో కర్ఫ్యూ సడలింపు

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కర్ఫ్యూ సడలించారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంటుందని కొవిడ్ నియంత్రణ టాస్క్ ఫోర్స్ తెలిపింది. సాయంత్రం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని వెల్లడించింది.

srikalahasti
శ్రీకాళహస్తి
author img

By

Published : Jul 9, 2021, 11:14 AM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో నేటి నుంచి ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కర్ఫ్యూను సడలిస్తూ కొవిడ్ నియంత్రణ టాస్క్ ఫోర్స్ బృందం నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు అత్యధికంగా నమోదు అవుతుండటంతో ఇప్పటివరకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు అమల్లో ఉండేది.

అయితే రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ సడలిస్తూ నిర్ణయం తీసుకోవడంతో శ్రీకాళహస్తిలో సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని పురపాలక సంఘం కమిషనర్ వెంకటరమణ తెలిపారు. కరోనా కేసులు పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టేంతవరకు అత్యవసరమయితే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు. మాస్కులు ధరించడం తో పాటు సామాజిక దూరం పాటించాలని సూచించారు .

ఇదీ చదవండి: Tirumala: తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.