చిత్తూరు జిల్లాలో కరోనా వైరస్ రోజురోజుకి వ్యాప్తి చెందుతోంది. కొత్తగా 948 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యినట్లు అధికారులు వెల్లడించారు. మరో 12 మంది కొవిడ్ బాధితులు మృతి చెందటంతో.. మృతుల సంఖ్య 406కి చేరినట్లు వివరించారు. కొత్తగా నమోదైన కేసులతో ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 35 వేల 713 మందికి కరోనా సోకినట్లు తెలిపారు. తిరుపతిలోనే అత్యధికంగా కరోనా బారిన పడుతుండటంతో.. లాక్డౌన్ పొడిగించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దుకాణాలకు అనుమతిచ్చారు.
ఇదీ చదవండి: వరవరరావు కోసం లేఖ రాస్తే దేశ బహిష్కారం కోరతారా?: భూమన