తిరుపతి ఉపఎన్నిక ప్రచారం ఒక్కటే చిత్తూరు జిల్లాలో కొవిడ్ కేసులు పెరగటానికి కారణం కాదని జిల్లా కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. తిరుపతి నగరపాలకసంస్థ కార్యాలయంలో ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యాధికారులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కొన్ని రోజులుగా కేసుల సంఖ్య గణనీయంగా పెరగటంతో నియంత్రణ చర్యలు చేపట్టే విధంగా అధికారులతో కలెక్టర్ చర్చించారు.
ఇదీ చదవండి: తిరుపతి ఉప ఎన్నిక వైకాపా పాలనకు రెఫరెండం: మంత్రి పేర్ని నాని
స్విమ్స్, రుయా ఆసుపత్రులు సహా తితిదే పద్మావతి అతిథిగృహంలో కరోనా చికిత్స అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. విష్ణునివాసం అతిథిగృహాన్ని కొవిడ్ కేర్ సెంటర్‌గా మార్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. మాస్కుల వినియోగంపై ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగిపోతోందన్న కలెక్టర్.. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వాటిని వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. తితిదే సర్వదర్శనం టోకెన్లు నిలిపివేయటంతో బయటి రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల సంఖ్య తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. తిరుపతి నగరంలో లాక్ డౌన్ విధిస్తారని వస్తున్న బూటకపు వార్తలను కలెక్టర్ ఖండించారు.
ఇదీ చదవండి: సైన్యం కోసం చైనా 5జీ సిగ్నల్ సదుపాయం