తెదేపా యువజన విభాగం తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా చిత్తూరు జిల్లా మదనపల్లె నియోజకవర్గానికి చెందిన బీసీ నేత గుండ్లపల్లి శ్రీరామ్ (చినబాబు) నియమితులయ్యారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సోమవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలియజేశారు. శ్రీరామ్ గతంలో అఖిల భారత చేనేత బోర్డు డైరెక్టర్గా, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్గా పని చేశారు. రాష్ట్ర తొగటవీర క్షత్రియ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పని చేస్తానని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామ్ అన్నారు. బీసీలను గుర్తించి తనను తెలుగు యువత అధ్యక్షుడిగా నియమించినందుకు పార్టీకి రుణపడి ఉంటానని అన్నారు. యువతను పార్టీ వైపు మళ్లించే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఇదీచదవండి.