ETV Bharat / state

'వైకాపా నేతలు రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు' - చిత్తూరులో ఎన్నికలు

మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైకాపా నేతలు రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని చిత్తూరు జిల్లా సీపీఎం నేతలు విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను బెదిరించి వారు నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేశారని మండిపడ్డారు. తిరుపతి కార్పొరేషన్​లోని పలు డివిజన్లలో పోటీ చేస్తున్న తమ పార్టీ నేతలను గెలిపించుకుంటామని స్పష్టం చేశారు.

chithore district cpm leaders fire on ycp leaders about nominations withdraw
చిత్తూరు జిల్లా సీపీఎం నేతలు
author img

By

Published : Mar 4, 2021, 9:18 PM IST

బలవంతపు ఏకగ్రీవాలతో అధికార పార్టీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి కళంకం తెచ్చిందని సీపీఎం నేతలు ఆరోపించారు. పురపాలక ఎన్నికల్లో వైకాపా కార్యకర్తలు మొదలు నాయకుల వరకు అందరూ రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పుంగనూరు, పలమనేరు, మదనపల్లె, తిరుపతిలో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను బెదిరించడం, కిడ్నాప్ చేయటం, వారి వ్యాపారాలపై దాడులు చేయడం ద్వారా ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు.

పోలీసులు వైకాపా కార్యకర్తలుగా వ్యవహరిస్తూ పోలీస్ స్టేషన్లను అధికార పార్టీ అడ్డాలుగా మార్చేశారని సీపీఎం నేతలు విమర్శించారు. అధికార పార్టీ దౌర్జన్యాలు పరాకాష్టకు చేరాయని, చిత్తూరు నగరపాలక సంస్థలో తమ పార్టీ అభ్యర్థిని బెదిరించి నామినేషన్ ఉపసంహరించుకునేలా చేశారని ఆరోపించారు. జిల్లాలో జరుగుతున్న దౌర్జన్యాలకు అధికార పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. తిరుపతి కార్పొరేషన్​లో పోటీ చేస్తున్న ఐదుగురు సీపీఎం అభ్యర్థులను ప్రజలు గెలిపించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీచదవండి.

తిరుపతి నగర పాలక సంస్థ ఏడో డివిజన్ ఎన్నిక రద్దు: ఎస్‌ఈసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.