కుప్పం ప్రాంతీయ ఆసుపత్రిలో ఎన్టీఆర్ ట్రస్టు నిధులతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంటును ప్రారంభించిన తర్వాత.. చంద్రబాబు విలేకర్లతో మాట్లాడారు. జనసేనతో పొత్తుపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ‘పొత్తులు పెట్టుకున్నప్పుడే తెదేపా గెలిచిందని వైకాపా నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఇతర పార్టీలతో కలిసి పోటీ చేసినప్పుడు గెలిచాం, ఓడిపోయాం కూడా. రాష్ట్ర ప్రయోజనాల మేరకు పరిస్థితులకు అనుగుణంగా పొత్తులపై నిర్ణయం తీసుకుంటాం’ అని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఎన్టీఆర్ శతజయంతి సంబరాలు ఘనంగా చేస్తామన్నారు. కార్యక్రమంలో మాజీమంత్రి అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీ దొరబాబు, నాయకులు శ్రీధర్ వర్మ, గౌనివారి శ్రీనివాసులు, గాజుల ఖాదర్‌బాషా పాల్గొన్నారు.
ఇదీ చదవండి
CBN On YSRCP: బెదిరింపులకు భయపడేది లేదు..వైకాపా ప్రభుత్వంపై గట్టిగా పోరాడాలి: చంద్రబాబు