ప్రశాంత కుప్పం నియోజకవర్గంలో అలజడులు సృష్టించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో చోటా వైకాపా నాయకులు రెచ్చిపోతున్నారని దుయ్యబట్టారు. డబ్బులు వసూలు చేసుకోవటానికి ఉబలాటపడుతున్నారని.. పుంగనూరులో ఓ మహానేత సర్వం దోచుకుంటున్నారని ఆరోపించారు. చిత్తూరు జిల్లా కుప్పుం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. గుడుపల్లెలో తెదేపా కార్యకర్తల భేటీలో చంద్రబాబు పాల్గొన్నారు.
"కుప్పం ప్రజలను భయపెట్టి నన్ను దెబ్బతీయాలనుకున్నారు. 84 మందుపాతరలకే నేను భయపడలేదు. 40 ఏళ్లుగా పంచాయతీ ఎన్నికల్లో నేను జోక్యం చేసుకోలేదు. కుప్పంలో జూద సంస్కృతి తీసుకువచ్చారు"- చంద్రబాబు.
రాష్ట్రాభివృద్ధి కోసం చాలాసార్లు కుప్పంను పట్టించుకోలేదని చంద్రబాబు అన్నారు. కుప్పం శ్రేణుల్లో కొత్త రక్తం ఎక్కించడం తన బాధ్యత అని పేర్కొన్నారు. కుప్పం కార్యకర్తల కోసం ఎంతైనా ఖర్చు పెడతానని అన్నారు.
'అధికారుల పనితీరును అధికారంలోకి వచ్చాక సమీక్షిస్తా. కార్యకర్తలపై తప్పుడు కేసులు ఒక్క సంతకంతో మాఫీ చేస్తా. రెండేళ్లు గడుస్తున్నా కుప్పానికి నీళ్లు ఇవ్వట్లేదు. మళ్లీ అధికారంలోకి వచ్చాక కుప్పానికి నీళ్లు ఇస్తా' - చంద్రబాబు
ఇదీ చదవండి: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైకాపా