చిత్తూరు జిల్లా కుప్పం ద్రవిడ యూనివర్సిటీ భూముల్లో అక్రమ మైనింగ్, పర్యావరణ విధ్వంసం, వన్యప్రాణుల మృతి వంటి అంశాలపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. యూనివర్సిటీలో అక్రమమైనింగ్‌ను అడ్డుకొని పర్యావరణాన్ని కాపాడాలని విన్నవించారు. అక్రమ మైనింగ్‌కు ద్రవిడ యూనివర్సిటీ హబ్‌గా మారిందని విమర్శించారు. యూనివర్సిటీకి చెందిన 1100 ఎకరాల భూముల్లో వైకాపా నేతలు అక్రమ మైనింగ్ కొనసాగిస్తున్నారని ఆరోపించారు.
ఇష్టానుసారంగా చేస్తున్న గ్రానైట్ బ్లాస్టింగ్, అక్రమ రవాణా కారణంగా వన్యప్రాణులు చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నెమళ్లతో పాటు అరుదైన జంతుజాలం నశిస్తోందని పేర్కొన్నారు. యూనివర్సిటీ విద్యార్థులకు అందించే ఆహారంలోనూ నాణ్యత లోపించి ఇటీవల వందలాదిమంది అస్వస్థతకు గురయ్యారని గుర్తుచేశారు. యూనివర్సిటీలో అంబులెన్స్ సౌకర్యం కూడా లేదని విమర్శించారు. యూనివర్సిటీలో పరిస్థితులను చక్కదిద్దేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను చంద్రబాబు కోరారు.
ఇవీ చూడండి