ETV Bharat / state

జూబ్లీహిల్స్​లోని ఆ రెండు పబ్​లపై కేసు నమోదు.. ఎందుకంటే..! - case on amnesia pub

Cases on Pubs in jubilee hills: తెలంగాణ రాష్ట్రం హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ రాత్రి 10 తర్వాత శబ్ద కాలుష్యం సృష్టించిన పబ్​లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. జూబ్లీహిల్స్​లోని అమ్నీషియాతో పాటు మరో పబ్​ యాజమాన్యంపై చర్యలు తీసుకున్నారు.

cases on pubs
cases on pubs
author img

By

Published : Nov 7, 2022, 1:12 PM IST

Cases on Pubs in jubilee hills: తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్​ జూబ్లీహిల్స్ పోలీస్​స్టేషన్ పరిధిలోని పలు పబ్బులపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ.. రాత్రి 10 దాటిన తర్వాత శబ్ద కాలుష్యం సృష్టించినందుకు చర్యలు తీసుకున్నారు. జూబ్లీహిల్స్​లోని అమ్నీషియా, ఇన్​సోమ్నియా పబ్​ యజమానులు రాజా శ్రీకర్​, కునాల్​ కుక్రేజా, మేంజర్​ యూనిస్​లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు.

ఇవీ కోర్టు ఆదేశాలు..: రాత్రి 10 తర్వాత సంగీత హోరుతో శబ్ద కాలుష్యం సృష్టిస్తే.. కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని హైకోర్టు గతంలో పోలీసులను ఆదేశించింది. పబ్​ల నిర్వహణలో నిబంధనలు, కోర్టు ఇచ్చిన ఆదేశాలను కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. నివాస ప్రాంతాల్లోని పబ్​లు సంగీతహోరుతో శబ్ద కాలుష్యం సృష్టిస్తున్నా పోలీసులు పట్టించుకోవట్లేదని.. అక్కడకు వచ్చే వారు వాహనాలను ఇళ్ల ముందే నిలుపుతున్నా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.