చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని అమ్మపాలెం పరిధిలోని స్వర్ణముఖి నదిలో ఈత కోసం దిగిన బాలుడు నీటి గుంతలో మునిగి మృతి చెందాడు. వరదయ్యపాలెం మండలంలోని సంతవేలూరుకు చెందిన హరిత, వెంకటేశ్‌ల కుమారుడు సూరి, తన అమ్మమ్మ గ్రామం అమ్మపాలెంకు వచ్చాడు. స్థానికంగా పిల్లలతో కలసి స్వర్ణముఖి నదిలో ఈతకొట్టేందుకు వెళ్లాడు. నలుగురు పిల్లలు నీటమునిగారు. గమనించిన ఇద్దరు యువకులు, ముగ్గురు పిల్లల్ని రక్షించారు. అప్పటికే సూరి నీట మునగడంతో మృతిచెందినట్లు స్థానికులు వెల్లడించారు. ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇవీ చూడండి : భూవివాదంలో గొడ్డళ్లతో దాడి.. తండ్రి మృతి, కుమారుడికి తీవ్రగాయాలు