చిత్తూరు జిల్లా చీగలపల్లి శివార్లలోని జొన్నతోటలో బాలుడి మృతదేహం లభించింది. మృతుడు చీగలపల్లికి చెందిన వెంకటేశ్ కుమారుడు వెంకటాచలపతి(7)గా గుర్తించారు. ఉగాది పూజ కోసం నిన్న మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిన బాలుడు సాయంత్రం వరకు ఇంటికి రాలేదు. వెతకటం ప్రారంభించిన అతని బంధువులకు.. గ్రామశివార్లలో మృతదేహం కనిపించింది. బాలుడి ముఖం, శరీరంపై రక్తపు గాయాలు ఉండటంతో హత్యగా అనుమానిస్తున్నారు. ప్రమాదమా లేక హత్యా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండీ.. విద్యార్థినులకు అందని ఆహారం.. పిల్లలను తీసుకెళ్లిన తల్లిదండ్రులు