శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ముగ్గురు వ్యక్తుల సాయంతో స్థానిక ఎమ్మెల్యే గుడిని, బడిని వదలకుండా అవినీతికి పాల్పడుతున్నారని తెదేపా నేత బొజ్జల సుధీర్ రెడ్డి ఆరోపించారు. కాంట్రాక్టర్లను బెదిరించి, వారి నుంచి డబ్బు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. స్వర్ణముఖి నదిలోని ఇసుక రీచ్ పాయింట్ నుంచి రోజుకి 2లక్షల రూపాయల వరకు ఆదాయం ఎమ్మెల్యేకు పోతోందని ఆరోపించారు. చంద్రబాబు పాలనలో 23 పరిశ్రమలకు అనుమతులిస్తే... ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే సదరు పరిశ్రమలను మామూళ్ల కోసం బెదిరిస్తున్నారని ఆక్షేపించారు.
ఇదీ చదవండీ... నిధుల వేటలో ప్రభుత్వం... గ్యాస్‌పై 10 శాతం వ్యాట్ పెంపు