చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు నియోజకవర్గం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాత చెక్పోస్ట్ వద్ద గుర్తు తెలియని వృద్ధుడు గత కొన్ని రోజులుగా అక్కడే తిరుగుతూ ఉండేవాడు. రాత్రి వేళల్లో గ్రామ శివారులో ఉన్న గ్రానైట్ క్వారీ రాతిపై నిద్రించేవాడు. గత రాత్రి కురిసిన వర్షానికి తడిసిన వృద్ధుడు నిద్రలోనే మృతి చెందాడు. దీనిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాతి మీద విగతజీవిగా పడి ఉన్న వృద్ధుని మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు యాచకుడిగా ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. సమీప ప్రాంతాల్లో విచారించి దహన క్రియలు చేయనున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి :