చిత్తూరు జిల్లా కుప్పంలో అన్నా క్యాంటీన్ ధ్వంసం సంఘటనకు సంబంధించి తెదేపా అధినేత చంద్రబాబు పాదయాత్ర చేపట్టారు. ఆ సందర్బంగా జరిగిన లాఠీచార్జీ తదితర సంఘటనల్లో మరో మూడు కేసులు నమోదయ్యాయి. కుప్పం నియోజకవర్గంలో తెదేపా నేతల అరెస్టుల పర్వం మెుదలైంది. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మూడు రోజుల పర్యటనలో చోటు చేసుకున్న ఘటనలపై పోలీసులు పలు కేసులు నమోదుచేసి అరెస్ట్లు ప్రారంభించారు. రామకుప్పం మండలం కల్లుపల్లిలో తెదేపా, వైకాపా శ్రేణుల మధ్య జరిగిన రాళ్ల దాడి ఘటనలో మూడు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి మాజీ శాసనమండలి సభ్యుడు గౌనిగాని శ్రీనివాసులతో పాటు పలువురు మాజీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను ముద్దాయిలుగా చేర్చారు. ఈ కేసుల్లో గౌనిగాని శ్రీనివాసు, మణి, జాకీర్లను అరెస్ట్ చేశారు. చంద్రబాబు మూడు రోజుల పర్యటన ముగించుకుని వెళ్లిన వెంటనే అరెస్ట్లు ప్రారంభమవ్వడంపై తెదేపా శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: