ETV Bharat / state

శివయ్యా.. నీ పనుల పూర్తికి ఇంకా ఎన్నాళ్లయ్యా? - శివయ్యా.. ఎన్నాళ్లిలా..?

చుట్టు పక్కల సుమారు 30 కి.మీ. దూరం నుంచే క్షేత్ర ప్రాభవం కనిపించేలా శ్రీకాళహస్తిలో శివపార్వతుల విగ్రహాల ఏర్పాటు పనులు రెండేళ్ల క్రితం ప్రారంభమయ్యాయి. నానాటికీ నత్తనడకన సాగుతున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా 4 నెలలుగా వాయిదా పడ్డాయి. తాజాగా మూడ్రోజుల క్రితం పనులు మళ్లీ మొదలయ్యాయి. తాజా లెక్కన.. గౌరీశంకరుల విగ్రహాల ఏర్పాటుకు సుమారు ఏడాదిన్నర పట్టే అవకాశముందని అధికారగణం భావిస్తోంది.

arranging lord siva parvathis statues on kailasagiri srihalahasti getting delay
శివయ్యా.. ఎన్నాళ్లిలా..?
author img

By

Published : Jul 20, 2020, 5:45 PM IST

చుట్టు పక్కల సుమారు 30 కి.మీ. దూరం నుంచే క్షేత్ర ప్రాభవం కన్పించేలా శ్రీకాళహస్తిలో శివపార్వతుల విగ్రహాల ఏర్పాటు పనులు రెండేళ్ల క్రితం ప్రారంభమయ్యాయి. రూ.2.70 కోట్లు వ్యయంతో 52 అడుగుల మేర విగ్రహాల ఏర్పాటుకు నిర్ణయించారు. పీఠం 18 అడుగులు కాగా, మరో 34 అడుగుల ఎత్తులో ఆది దంపతుల ప్రతిమల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

కైలాసగిరుల్లో ఈ ఏర్పాటు పనులు ఆది నుంచీ నత్తనడకన సాగుతున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఫిబ్రవరిలో పనులు నిలిపివేశారు. తర్వాత కరోనా కారణంగా కూలీలు సొంతూళ్లకు వెళ్లిపోయారు. 4 నెలల తర్వాత.. ఇటీవలే మూడ్రోజుల క్రితం పనులను మరోసారి అధికారులు ప్రారంభించారు.

సుమారు ఏడాది నుంచి ఏడాదిన్నరలోపు విగ్రహాల ఏర్పాటు, మెట్ల మార్గం తదితర పనులన్నీ పూర్తయ్యే అవకాశముందని ఆలయ డీఈ మురళీధర్‌రెడ్డి తెలిపారు.

ఇవీ చదవండి:

డాలర్​ శేషాద్రికి కరోనా సోకిందంటూ ట్వీట్​.. వ్యక్తిపై కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.