కరోనా కట్టడిపై ప్రతిపక్షాలపై ప్రభుత్వం నిందలు వేయకుండా నిజాయితీగా పనిచేయాలని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ హితవుపలికారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఆక్సిజన్ అందక పదుల సంఖ్యలో మరణించిన కరోనా బాధితులకు ఆయన శ్రద్ధాంజలి ఘటించారు.
అఖిలపక్షాల పార్టీల పిలుపుమేరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా ప్రభావంతో మరణించిన వారికి శైలజానాథ్ నివాళులు ఆర్పించారు. ప్రతిపక్షాలపై నిందలు మాని నిజాయితీగా పనిచేయాలని ప్రభుత్వానికి సూచించారు.
ఇదీ చదవండి:
'మూతపడిన ప్లాంట్లు గుర్తిస్తున్నాం.. ఆక్సిజన్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నాం'