సాయుధ దళ మాబులైజేషన్లో భాగంగా జరుగుతున్న ఫైరింగ్ రేంజ్ ప్రాక్టీస్‌లో ఎటువంటి అనుమానాలున్నా వాటిని నివృత్తి చేసుకోవాలని తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పల నాయుడు సూచించారు. వార్షిక ఫైరింగ్ రేంజ్ ప్రాక్టీస్‌లో భాగంగా చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో ఆదివారం ఉదయం పీటీసీ కల్యాణి డ్యాం ఫైరింగ్ రేంజ్లో ప్రాక్టీస్ నిర్వహించారు. ఫైరింగ్ శిక్షణలో పాల్గొన్న ఎస్పీ.. సిబ్బందిలో ఉత్సాహాన్ని, మనోధైర్యాన్ని నింపారు. ఫైరింగ్‌లో ప్రతిభ కనబరిచిన అధికారులను, సిబ్బందిని తిరుపతి అర్బన్ ఎస్పీ అభినందించారు.
ప్రతి ఒక్క బుల్లెట్ టార్గెట్‌ను ఛేదించేలా ఉండాలన్నారు. అదేవిధంగా అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని పోలీస్ శాఖ ఉన్నతి కోసం ముందడుగు వేయాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పీటీసీ సిబ్బందితో పాటు, అడ్మిన్ అడిషనల్ ఎస్పీ సుప్రజ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: