ETV Bharat / state

Student Suicide Case: మిస్బా ఆత్మహత్య కేసులో పురోగతి.. ఉపాధ్యాయుడు అరెస్ట్​ - చిత్తూరు మిస్బా ఆత్మహత్య కేసులో ఉపాధ్యాయుడి అరెస్ట్​

Misbah suicide case: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిస్బా ఆత్మహత్య కేసులో... ఉపాధ్యాయుడు రమేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మిస్బా ఆత్మహత్య కేసును రాజకీయాలకు అతీతంగా విచారణ చేసి... దోషులను శిక్షించాలని ప్రజాసంఘాలు, రాజకీయ పక్షాలు డిమాండ్‌ చేశాయి. మిస్బా తల్లిదండ్రులను చరవాణి ద్వారా తెలుగుదేశం అధినేత చంద్రబాబు పరామర్శించి... పార్టీ తరపున సాయం అందించారు.

Misbah suicide case
మిస్బా ఆత్మహత్య కేసులో ఉపాధ్యాయుడు అరెస్ట్​
author img

By

Published : Mar 26, 2022, 7:30 AM IST

మిస్బా ఆత్మహత్య కేసులో ఉపాధ్యాయుడు అరెస్ట్​

Misbah suicide case: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన పదో తరగతి విద్యార్థి మిస్బా ఆత్మహత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మిస్బా మృతి చెందిన నాలుగు రోజుల తర్వాత.... మృతికి కారకుడిగా భావిస్తున్న ఉపాధ్యాయుడు రమేష్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మిస్బా చదువుతున్న బ్రహ్మర్షి పాఠశాల నిర్వాహకులు వేధించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. మిస్బా తండ్రి ఫిర్యాదుతో కేసునమోదు చేసిన పోలీసులు ఉపాధ్యాయుడు రమేష్‌ కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. తమిళనాడులోని రామేశ్వరంలో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు... అక్కడే అతణ్ని అదుపులోకి తీసుకొన్నారు. అనంతరం స్థానికంగా కోర్టులో హాజరుపరిచి ట్రాన్‌సిట్‌ వారెంట్‌ ద్వారా పలమనేరుకు తీసుకువచ్చారు.

Misbah suicide case: వైకాపా నేత తన కూతురు మొదటి ర్యాంకు సాధించడానికి వీలుగా మిస్బాను బ్రహ్మర్షి పాఠశాల నుంచి పంపేశారన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. వైకాపా నేత సునీల్‌కుమార్‌ కోసం ఆరా తీస్తున్నారు. మరో వైపు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు మిస్బా తల్లిదండ్రులను చరవాణి ద్వారా పరామర్శించారు. మాజీ మంత్రి, పలమనేరు నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి అమరనాథరెడ్డి మిస్బా ఇంటికి వెళ్లి చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడించారు. పార్టీ తరపున ఆర్ధిక సాయం చేశారు. రాజకీయాలకు అతీతంగా మిస్బా కేసులో వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. నిందుతలపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ ఎస్పీని ఆదేశించింది. పూర్తి నివేదిక అందించాలని కలెక్టర్‌ను కోరింది.

Misbah suicide case: మిస్బా ఆత్మహత్యకు కారకులైన వారిని వెంటనే శిక్షించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట తెలుగునాడు విద్యార్థి సమైఖ్య ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతపురం జిల్లా మడకశిరలో ముస్లిం మైనార్టీల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేశారు. తిరుపతి ఎస్పీ యూనివర్శిటీ ప్రధాన ద్వారం వద్ద టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు.

ఇదీ చదవండి: చదువుల తల్లిని చంపేశారా.. వైకాపా నేత కూతురి కోసం దారుణం!?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.