చిత్తూరు జిల్లా మదనపల్లెలో జంట హత్యల కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గురైన యువతుల తల్లిదండ్రులు పురుషోత్తం, పద్మజలను మదనపల్లి తాలుకా పోలీస్ స్టేషన్కి విచారణ నిమిత్తం తరలించారు. న్యాయ నిపుణుల సలహా మేరకు నిందితులను విచారణ అనంతరం కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం తెలుస్తోంది.
మదనపల్లె ఘటన హత్య కేసులో ఏ-1గా పురుషోత్తం, ఏ-2 పద్మజగా పేర్కొన్నారు. కాసేపట్లో మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి నిందితులను తరలించనున్నారు. అనంతరం జడ్జి ఎదుట వారిని పోలీసులు హాజరుపరచనున్నారు.
ఇదీ చదవండి: