ETV Bharat / state

జిల్లా జైలు నుంచి ఖైదీ పరారీ.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు - chittoor district jail news

జైలు నుంచి ఖైదీలు పారిపోయే సీన్లు సినిమాల్లో చూస్తుంటాం. అలా నేను ఎందుకు ప్రయత్నించకూడదని అనుకున్నాడో.. ప్రణాళిక ప్రకారమే చేశాడో కానీ.. జైలు నుంచి ఖైదీ తప్పించుకున్నాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా జైలులో జరిగింది.

prisoner
జైలు నుంచి పారిపోయిన ఖైదీ
author img

By

Published : Jun 25, 2021, 10:50 PM IST

చిత్తూరులోని జిల్లా జైలు నుంచి ఒక ఖైదీ పారిపోయాడు. బంగారుపాళ్యం మండలం గుంతూరు గ్రామానికి చెందిన గజేంద్ర అనే వ్యక్తి ఓ హత్య కేసులో ముద్దాయిగా ఉన్నాడు. అతన్ని జిల్లా జైలులో ఉంచారు. ఈ రోజు జైలు ఆవరణలోని వంట గదికి వెళ్లాలని చెప్పి.. అతను ఉండే గది నుంచి బయటకు వచ్చాడు. అక్కడినుంచి వంటగది పక్కనే ఉన్న గోడ దూకి తప్పించుకున్నట్లు జైలు అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై జైలు సూపరింటెండెంట్ ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: ROAD ACCIDENTS: మూడు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు.. 8మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.