ETV Bharat / state

బాల్య వివాహం చేసిన తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన చిన్నారి - girl opposes child marriage news

బాల్యవివాహాలను రూపుమాపేందుకు ఎంతో మంది మహానుభావులు ఎన్నో పోరాటాలు చేశారు. కానీ ఇప్పటికీ ఇలాంటి సంఘటనలు జరగటం దురదృష్టకరం. కాపాడాల్సిన తల్లిదండ్రులే చిన్నారిని వివాహబంధంలో నెట్టేసారు. తనకు న్యాయం చేయాలంటూ ఆ చిన్నారి పెళ్లికూతురు పోలీసులను ఆశ్రయించింది.

child marriage
తన వివాహంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన చిన్నారి
author img

By

Published : Nov 13, 2020, 10:37 AM IST

Updated : Nov 13, 2020, 2:28 PM IST

‘మైనార్​ అయిన నన్ను మోసం చేసి... 34 ఏళ్ల వయసున్న వ్యక్తితో రహస్యంగా తల్లిదండ్రులు వివాహం జరిపించారు. ఆపై విషయం బయటకు పొక్కింది. వెంటనే గుట్టుచప్పుడు కాకుండా యువకుడి కుటుంబ సభ్యులు మెడలో తాళిని తెంచేశారు’ అని ఓ బాలిక గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెదురుకుప్పం మండలంలోని పాతగుంట గ్రామానికి చెందిన బాలికను(16) తల్లిదండ్రులు.. సమీప బంధువులతో కలిసి ఈ నెల పదో తేదీన అర్ధరాత్రి సమయంలో గ్రామానికే చెందిన రాజశేఖర్‌రెడ్డి(34)తో వ్యానులో తరలించి శ్రీకాళహస్తిలోని ఓ ఆలయంలో రహస్య వివాహం జరిపించారు. తనకు ఇప్పుడే వివాహం వద్దని బాలిక వారిస్తున్నా వినని ఇరువైపులా పెద్దలు అత్తారింట్లో దిగబెట్టారు. గ్రామస్థులు అందించిన రహస్య సమాచారంతో ఐసీడీఎస్‌ అధికారులు రంగంలోకి దిగి చర్యలు చేపట్టేలోపే వరుడి తల్లి.. ఆ బాలిక మెడలో మంగళ సూత్రాన్ని తెంచేసింది. మైనర్‌ అయిన తనను వివాహం పేరుతో వంచించిన వారిపై చర్యలు చేపట్టి న్యాయం చేయాలంటూ గురువారం నేరుగా ఎస్సై లోకేష్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసింది. బాలిక తల్లిదండ్రులు సహా రాజశేఖర్‌రెడ్డి, అతడి తల్లిదండ్రులు, బంధువులు ఆనందరెడ్డి, మోహన్‌పై ఫిర్యాదు చేసిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై చెప్పారు.

ఇదీ చదవండి: కొత్త జిల్లాలపై కదలిక.. జనవరికల్లా ఏర్పాటుకు సిద్ధం!

Last Updated : Nov 13, 2020, 2:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.